Friday, April 26, 2024
Friday, April 26, 2024

నాపై కక్ష గట్టి కేసులు పెడుతున్నారు : అశోక్‌ గజపతిరాజు

తనపై ప్రభుత్వం వ్యక్తిగతంగా దృష్టి సారించిందని మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాలరాస్తోందని విమర్శించారు.నిన్న రామతీర్థం వద్ద సంప్రదాయబద్దంగా జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమాన్ని వాళ్ల ఇష్టం వచ్చినట్లు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవాదాయ చట్టం రాష్ట్రంలో ఉందని.. అది లేకపోయి ఉంటే తను చైర్మన్‌ పదవి నుంచి ఈ ప్రభుత్వం ఎప్పుడో తొలగించేసి ఉండేదని అన్నారు. దేవాలయాలకు దేవుడే యజమాని అని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వాడుతున్న భాష తనకు రాదన్నారు. రామతీర్ధం కొండపై ఆలయ పునర్నిర్మాణ ముహూర్తం తేదీ నిర్ణయించే ముందు తెలియపరచమని చెప్పినా తన మాట పట్టించుకో లేదన్నారు. ప్రభుత్వంలో దేవాదాయ అంశం భాగం కాదని సుప్రీంకోర్టు పదే పదే చెబుతున్నా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. పోలీసులకు చెబితే బూట్లు విప్పారు గానీ, రాజకీయ నాయకులు మాత్రం అమర్యాదగా వ్యవహరించారని అన్నారు. దేవాలయాల నిధులు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం అనుసరించడం లేదని మండిపడ్డారు. ప్రశ్నించిన తనపై కక్ష గట్టి కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img