Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పాదయాత్రపై ఏమిటీ జులుం ?

. ఇది ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా?
. డ్రామాలు కట్టిపెట్టి మంత్రులు రాజీనామా చేయాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తూ ఉక్కుపాదం మోపడం పోలీసులకు తగదని, ఏపీలో నడిచేది ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం రామకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర చేస్తున్నారు. హైకోర్టు అనుమతితో చేస్తున్న ఈ పాదయాత్రకు జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం ఆది నుండి అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నది. రైతులను రెచ్చగొట్టేలా మంత్రులు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్‌ ప్రోద్భలంతో వైసీపీ వర్గీయులు అమరావతి పాదయాత్రీకులపై రాళ్లు, బాటిళ్లు, కర్రలతో దాడి చేయగా, నిన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పసలపూడిలో సాక్షాత్తూ పోలీసులు అడ్డుకుని 600 మంది రైతుల ఐడీ కార్డులు చూపాలనడం, లాఠీలూ, తాళ్లు అడ్డుపెట్టి తోపులాటకు గురిచేయడం, మహిళలపై జులుం ప్రదర్శించడం, పాదయాత్రీకులు గాయపడడం వంటి దుశ్చర్యలకు పోలీసులు పాల్పడటం దుర్మార్గం. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
అమరావతి రాజధానిని మార్చాలనే మంత్రులు డ్రామాలు కట్టిపెట్టి రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. రైతుల పాదయాత్ర సజావుగా సాగేలా చూడాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ…దానిని ఖాతరు చేయకుండా అడ్డుకోవడం విచారకరం. అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణం. పోలీసుల వైఖరికి నిరసనగా పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన రైతులకు సంఫీుభావం ప్రకటిస్తున్నాం. అధికార వైసీపీ శ్రేణులు చేపట్టే పోటీ నిరసనలకు ఎటువంటి అనుమతులు అడగని పోలీసు యంత్రాంగం, అనుమతులున్న శాంతియుత నిరసనలపై ఉక్కుపాదం మోపడం న్యాయమా? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనధికార కార్యకర్తలుగా వ్యవహరించడం సరైనదేనా? పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు వైసీపీ అడుగులకు మడుగులొత్తడం తగునా? స్వేచ్ఛగా ప్రజాభిప్రాయాలు వెల్లడిరచే హక్కు ఏపీలో లేదా? అని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి న్యాయవ్యవస్థ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల గౌరవముంటే అమరావతి రైతుల పాదయాత్ర సజావుగా సాగేలా చూడాలి. ముఖ్యమంత్రి జగన్‌కి రాజధాని ఏర్పరచాలనే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే రూ.10 వేల కోట్లతో అభివృద్ధి చెందిన అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలి. అలా కాకుండా రైతుల పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, పోలీసు యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రామకృష్ణ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img