Friday, April 26, 2024
Friday, April 26, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం..రాష్ట్రానికి వర్ష సూచన

రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలను చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img