Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

బడ్జెట్‌ అంతా తప్పులతడక అంటూ ఆందోళనకు దిగిన టీడీపీ

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 2022-23 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి బుగ్గన బడ్జెట్‌పై ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. బడ్జెట్‌లో అన్నీ అబద్దాలు చెబుతున్నారని టీడీపీ ఆందోళనకు దిగింది. బడ్జెట్‌ అంతా తప్పులతడకగా ఉందంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు. ప్రతిపక్ష వైఖరిపై స్పీకర్‌ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ ప్రసంగం తర్వాత అభ్యంతరాలు చెప్పాలని స్పీకర్‌ తెలిపారు. అవసరమైతే సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని టీడీపీ సభ్యులను ఉద్దేశించి మంత్రి బుగ్గన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన ర్యాలీ
కాగా ఇవాళ ఉదయం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏపీ అసెంబ్లీకి నిరసన ర్యాలీగా బయలుదేరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందంటూ లోకేష్‌ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ కొరవడిరదని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ శాసనసభ పక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, బడ్జెట్‌కు చట్టబద్ధత ఉందో లేదో అన్నట్లు ప్రభుత్వ వ్యవహారం ఉందని విమర్శించారు. లెక్కలు లేకుండా చేసిన ఖర్చుకు సంబంధించిన నిధులు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌కు బడ్జెట్‌ నిధులు మల్లుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ బాండ్లన్నీ అమ్మకానికి పెట్టేస్తే ఇక రాష్ట్రంలో ఏం మిగులుతుందని నిలదీశారు. చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో ముఖ్యమంత్రి వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దేనికీ స్పష్టమైన సమాధానం ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img