Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భూ వివాదాల పరిష్కారానికి సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం

జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమీక్షా సమావేశంలో భూ వివాదాల పరిష్కారం కోసం సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జగనన్న భూరక్ష హక్కు కింద సమగ్ర సర్వే ముగిశాక కూడా ట్రైబ్యునళ్లు కొనసాగనున్నట్లు వెల్లడిరచారు.
ప్రతి మండల కేంద్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని, శాశ్వత ప్రాతిపదికన ఈ ట్రైబ్యునల్‌ పనిచేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. సర్వే సందర్భంగా కూడా తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలని అధికారులకు వెల్లడిరచారు. మొబైల్‌ ట్క్రెబ్యునల్‌ యూనిట్లు ఉండాలని, దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. భూ వివాదాల పరిష్కారంపై రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థను తీసుకురావాలని అధికారులకు సీఎం ఆకాంక్షించారు.
భూసర్వేపై జగన్‌ ఆదేశాలివే
ఎవరైనా ఒక వ్యక్తి తమ భూమిలో సర్వేకావాలని దరఖాస్తు చేసుకుంటే… కచ్చితంగా సర్వే చేయాలని, నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జగన్‌ ఆదేశించారు. దీనికోసం ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం ఆదేశించారు. సర్వేలో ఏరియల్‌ ఫ్లైయింగ్‌, డ్రోన్‌ఫ్లైయింగ్‌ నెలవారీ లక్ష్యాలను పెంచాలన్నారు. నెలకు వేయి గ్రామాలను చొప్పున ఇప్పుడు చేస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతో ఈ లక్ష్యాన్ని పెంచాలన్నారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కూడా సర్వేను వేగవంతం చేయాలన్నారు. 2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి సమగ్ర సర్వేను పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. సమగ్ర సర్వే ప్రక్రియ సమర్థవంతంగా సాగడానికి ప్రఖ్యాత లీగల్‌ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలని సీఎం సూచించారు. దీనివల్ల క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. సర్వే పూర్తయ్యే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సదుపాయం రావాలన్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో మంచి ఎస్‌ఓపీలు పాటించాలన్న సీఎం… నమూనా డాక్యుమెంట్‌ పత్రాలను పౌరులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాటి ఆధారంతో సులభంగా రిజిస్ట్రేషన్‌ జరిగేలా చూడాలని కోరారు. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టాలన్నారు.సీఎం ఈ మేరకు రిజిస్ట్రేషన్‌శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఏసీబీ నంబర్‌ స్పష్టంగా కనిపించేలా పోస్టర్‌, హోర్డింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img