Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పడి తీరుతాయి

మంత్రి కురసాల కన్నబాబు

రాష్ట్రంలో మూడు రాజధానులు కచ్చితం ఏర్పడి తీరుతాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రజామోదం ఉందని, స్థానిక ఎన్నికల్లో మాకు 85 శాతం ప్రజల మద్దతు రావడమే దీనికి నిదర్శనమని అన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము కాబట్టే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ జగన్‌ రైతుల పక్షాన నిలబడతారని, అందుకే ఎప్పటికప్పుడు పరిహారాన్ని అందిస్తున్నారని అన్నారు. గులాబ్‌ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘గులాబ్‌ తుఫాను బాధిత రైతులకు పరిహారం ఇచ్చాం. నివర్‌ తుపాను బాధితులకు కూడా అప్పుడే పరిహారం ఇచ్చేశాం అని చెప్పారు. రైతు పక్షపాతి జగన్‌ ఇప్పటి వరకు రూ.1,070 కోట్లు ఇచ్చారు. రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. త్రిముఖ వ్యూహంతో మేము పనిచేస్తున్నాం. అన్నారు. సోము వీర్రాజు ఏవేవో మాట్లాడుతున్నారు. ఇస్తామన్నదానికంటే ముందుగానే మేము రైతులకు పరిహారం ఇస్తున్నాం. కేంద్రం న్యాయం చేస్తున్నట్టు, రాష్ట్రం చేయనట్లు చెప్తే జనం నమ్మరు. కేంద్రం రైతుల పక్షాన ఉంటే ఢల్లీిలో రైతుల ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి?.అని అన్నారు. కుప్పం ప్రజల్లో మార్పు వచ్చింది. టీడీపీ వారు వైఎస్సార్‌సీపీ దొంగ ఓట్లు వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. లోకేష్‌ రెండు రోజులు పర్యటించి స్ట్రాంగ్‌ ఏజెంట్లను పెట్టుకున్నారు కదా?. మరి ఎలా దొంగ ఓట్లు వేయగలరు? అని ప్రశ్నించారు. మూడు రాజధానులు కట్టడం వైకాపా వల్ల కాదని నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. మూడు రాజధానులు కడతామో లేదో..వైకాపా వల్ల అవుతుందో లేదో అతి త్వరలోనే చూస్తారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img