Friday, April 26, 2024
Friday, April 26, 2024

రైతు ఆత్మహత్యలపై నెల రోజుల్లోగా న్యాయం చేయాలి : నాదెండ్ల

రైతుల పట్ల వైస్సార్సీపీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి పట్ల జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. రైతులు అంటే రైతులే..వారిలో కులాలను చూసి ప్రభుత్వ పథకాలను అమలు చేయడం దుర్మార్గమంటూ ఆయన వైస్సార్సీపీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా జగన్‌ సర్కారు స్పందించడం లేదని ఆరోపించారు. కౌలు రైతులకు కూడా రైతుల మాదిరే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన జగన్‌ సర్కారు.. కౌలు రైతులకు ఇచ్చే గుర్తింపు కార్డులను 5 లక్షలకే పరిమితం చేసిందని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు రూ.7 లక్షల నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కౌలు రైతులకు ఎదురవుతున్న సమస్యలను తమ పార్టీ మానవీయ సంక్షోభంగా పరిగణిస్తోందని నాదెండ్ల చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు నెల రోజుల్లోగా న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్వయంగా రంగంలోకి దిగుతారని కూడా హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img