Friday, April 26, 2024
Friday, April 26, 2024

విజయవాడలో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు..

ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో విజయవాడ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడ పట్టణంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేపు రాత్రి (డిసెంబర్‌ 31న) వేడుకలకు అనుమతి లేదని విజయవాడ కమిషనర్‌ క్రాంతి రాణా అన్నారు. బెజవాడలో న్యూ ఇయర్‌ వేడుకలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమలులో ఉందన్నారు. న్యూ ఇయర్‌ వేడుకలు రోడ్లపై చేస్తే కుదరదంటూ హెచ్చరించారు. అర్ధరాత్రి 12 వరకు మాత్రమే ఇండోర్‌ వేడుకలకు అనుమతిస్తున్నట్లు వెల్లడిరచారు. అర్ధరాత్రి రోడ్లపై ఎవరూ తిరగకూడదంటూ హెచ్చరించారు.12 గంటల వరకు కోవిడ్‌ నిబంధనల ప్రకారం వేడుకలు జరుపుకోవాలన్నారు. న్యూఇయర్‌ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా 15 చోట్ల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు రాణా టాటా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img