Friday, April 26, 2024
Friday, April 26, 2024

విమర్శించే వాళ్లకు అభివృద్ధి కనిపించడం లేదా?

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపును శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘అధికారంలోకి రాగానే పింఛన్‌ రూ.2,250కు పెంచామన్నారు. రెండున్నరేళ్లలో ఇవాళ రూ.2,500కు పింఛన్‌ పెంచుతున్నామని చెప్పారు. ‘ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నా. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు ఉన్నారు. నిరుపేదల కష్టాలు వారికి తెలుసా..? విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించడం లేదా?. ఆర్థిక ఆధారం లేక అల్లాడుతున్న వృత్తులు చాలా ఉన్నాయి. అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. 62 లక్షల మంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కేవలం 36 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేది.మేం 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈనెలలోనే కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెన్షన్‌ కోసం రూ.400 కోట్లు ఖర్చు చేసింది. మన ప్రభుత్వం పెన్షన్‌ కోసం నెలకు రూ.1450 కోట్లు ఖర్చు చేస్తోంది. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వంలాగా పెన్షన్‌లో కోత లేదు. కుల,మతం, రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నాం. అర్హులందరికీ పెన్షన్‌ అందిస్తున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తున్నాం.’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img