Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ లోని కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో భారీవర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా తేరుకోక ముందే మళ్ళీ అండమాన్‌ సముద్రం ప్రాంతంలో ఈ ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడిరది. ఇది రాగల 12గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి తదుపరి 24 గంటలలో మధ్య బంగాళా ఖా తం లో తుపాన్‌ గా మారుతుందని, తరువాత వాయువ్య దిశలో పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతం తీరానికి ప్రయాణించి ఉత్తరాంధ్ర , దక్షిణ ఒడిస్సా తీరాన్నీ ఈనెల 4వ తేదీని తాకవచ్చు అని వాతారణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని, ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img