Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఏపీలో నైట్‌ కర్ఫ్యూ..

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. కోవిడ్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ‘ప్రజలంతా మాస్కులు ధరించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలి. అని సీఎం జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 104 కాల్‌ సెంటర్‌ను బలంగా ఉంచాలి.ఎవరు కాల్‌చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలి.కొవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలి. నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలి.భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలి అని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img