Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఏపీలో మండుతున్న ఎండలు

నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు తప్పవన్న ఐఎండీ
ఏపీలో నాలుగు రోజుల పాటు నిప్పుల కుంపటిని తలపిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటికి రావొద్దని స్పష్టం చేసింది. వృద్ధులు, మహిళలు, గర్భవతులు ఇళ్లకే పరిమితం కావాలని, ప్రజలు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌ ద్రవాలు తీసుకోవడం మేలని సూచించింది. ఏపీలోని 41 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం కనిపిస్తుందని ఐఎండీ వర్గాలు వెల్లడిరచాయి. రేపు (ఏప్రిల్‌ 24) విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో గరిష్ఠంగా 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img