Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

జగనన్న కాలనీ లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు కేటాయించాలి

మైలవరం సిపిఐ డిమాండ్

విశాలాంధ్ర – మైలవరం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి జగనన్న కాలనీలు నిర్మిస్తూ 1,80,000 రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడం చాలా దారుణమని సిపి ఐ పార్టీ మైలవరం నియోజకవర్గ కార్యదర్శి బుడ్డి రమేష్ మైలవరం తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. సోమవారము ఆంధ్రప్రదేశ్ సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపుమేరకు మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద జగనన్న ఇండ్ల కాలనీ లబ్ధిదారుల తరుపు 1,80,000 నుండి 5 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ శ్రీహరి కి సోమవారం ఉదయం కార్యాలయంలో అర్జీ ఇవ్వటం జరిగింది పేద ప్రజలు 150000 రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడం కష్టతరమైందని ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని లేనిచో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మైలవరం మండల ఇన్చార్జి సిపిఐ కార్యదర్శి బుద్ధవరపు వెంకట్రావు , మహిళా సమైక్య నాయకులు కే రత్నకుమారి బి కుమారి, ఈ కృష్ణకుమారి, ఎం లక్ష్మి ఏ ఐ టి యు సి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు , కే సీతయ్య , బి జీవన్, జె రాజు ,కే సురేష్, డి శంకర్, కే నాగరాజు, రాంబాబు, ఈ నరసారావు, తదితరులు పాల్గొన్నారు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో తాగునీరు మురుగునీటిపారుదల విద్యుత్ సౌకర్యము రోడ్లు చెత్త తరలింపు తదితరమౌలిక సౌకర్యాలు కల్పించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img