Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

దక్షిణ కోస్తాంధ్రను కమ్మేసిన ఈశాన్య రుతుపవనాలు

అక్టోబరు 31 నుంచి నవంబరు 2 వరకు ఏపీకి వర్ష సూచన
దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం నేపథ్యంలో, ఈశాన్య రుతుపవనాల సీజన్‌ ప్రారంభమైంది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. దక్షిణ కోస్తాంధ్రతో పాటు తమిళనాడు తీర ప్రాంతం, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల కారణంగా నేడు వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ వెల్లడిరచింది. ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలులు బంగాళాఖాతం, దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల విస్తరణకు దోహదపడుతున్నాయని వివరించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబరు 31 నుంచి నవంబరు 2వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img