Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

బీసీలంటే బ్యాక్‌ బోన్‌.. : సీఎం జగన్‌

బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌లు కాదు.. బీసీలంటే బ్యాక్‌ బోన్‌ కాస్ట్‌.. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక అని నిరూపించామన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. భారతీయ సమాజానికి వెన్నెముకలు బీసీలని.. గతంలో బీసీలు వెనుకబడిపోయారన్నారు. వాళ్ల పరిస్థితులు మార్చాలని.. తన పాదయాత్రలో 139 బీసీ కులాలను కలిసిన తర్వాత వారి కష్టాలు, నష్టాలు అన్నీ చూశానన్నారు. ఆ తర్వాత వారి ఆశలను, ఆకాంక్షలను తెలుసుకున్న తర్వాత 2019 ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించామని గుర్తు చేశారు.రాష్ట్ర నలమూలల నుంచి వచ్చిన బీసీ సోదరులు, అక్కాచెల్లెమ్మలకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. రాజకీయ సాధికారతతో గ్రామం నుంచి రాజధానుల వరకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల జనసముద్రం ఈ సభ అన్నారు. మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారితో పాటూ వార్డు మెంబర్ల వరకు బీసీ కుటుంబం జన సముద్రంలా ఉందన్నారు. 82వేలమంది బీసీలు రాజకీయ సాధికారతతో పదవుల్లో ఉన్నారని.. ‘మీ హృయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు’ ఉన్నారన్నారు. ఇది ఎప్పటికీ మన అనుబంధంగా వ్యాఖ్యానించారు.బీసీలంటే ఇస్త్రీ పెట్టలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదని చంద్రబాబుకు చెప్పాలన్నారు. 2014లో బీసీలకు ఏకంగా చంద్రబాబు 114 వాగ్థానాలు ఇచ్చి అందులో పదిశాతం కూడా అమలు చేయని ఆయనకు చెప్పాలన్నారు. తాము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారామని చెప్పాలన్నారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం.. ఇప్పుడున్న ప్రభుత్వం మాది, మనది అని చెప్పాలన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణమాఫీ దగాను గుర్తు చేయాలన్నారు. గతంలో ఇలా ఇచ్చిన హామీలను గుర్తు చేయాలన్నారు. బీసీలను చంద్రబాబు చేసిన మోసాన్ని గుర్తు చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img