Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మాచర్ల టీడీపీ నేతలకు హైకోర్టులో బిగ్‌ రిలీఫ్‌

పల్నాడు జిల్లా మాచర్ల గొడవల్లో టీడీపీ వర్గీయులకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. మొత్తం 23మందికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఏ7 మినహా మిగతా అందరికీ బెయిల్‌ వచ్చింది. గొడవల్లో టీడీపీకి చెందిన 34 మందిపై హత్యాయత్నం కేసు నమోదు కాగా.. పది మందిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. మిగతా 24 మందిలో 23 మందికి ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును శ్రయించారు. జైల్లో ఉన్న 10 మంది బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. మొత్తం 24మందిలో కళ్లం రమణా రెడ్డికి తప్ప మిగిలిన టీడీపీ నేతలకు హైకోర్టు ఆంటీస్పైరీ బెయిల్‌ మంజూరు చేసింది. మాచర్ల ఘటనలో తమపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారంటూ టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇరు వైపుల లాయర్లు వాదనలు వినిపించారు.. కోర్టు ఆర్డర్స్‌ రిజర్వ్‌ చేసింది. నేడు తీర్పు ఇచ్చింది. టీడీపీ నేతల తరపున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. గత నెలలో మాచర్ల టీడీపీ ఇంఛార్జ్‌ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవల్లో కొన్ని ఇళ్లు ధ్వంసం కాగా.. ఓ వాహనానికి నిప్పు పెట్టారు. ఈ గొడవల్లో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు టీడీపీ వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇప్పుడు బెయిల్‌ వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img