Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మృతదేహాలతో వ్యాపారం చేసేవారిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి విడదల రజని

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి అంబులెన్స్‌ డ్రైవర్లు సాగించిన దందాపై ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని స్పందించారు.ఈ ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన మంత్రి… దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా మహాప్రస్థానం అంబులెన్స్‌లు నిరంతరం పనిచేసేలా త్వరలోనే ఓ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. మృతదేహాలతో వ్యాపారం చేసేవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఘటనపై రుయా సూపరింటెండెంట్‌ వివరణ కోరినట్లు చెప్పారు. మృతుడి కుటుంబాన్ని ఎవరు బెదిరించారని, వారు ఆసుపత్రి సిబ్బందా లేక ప్రైవేటు వ్యక్తులా అనే దానిపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడిరచారు. ‘ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దోషులను కఠినంగా శిక్షిస్తాం. మృతుడి కుటుంబ సభ్యులు, మహాప్రస్థానం అంబులెన్స్‌ డ్రైవర్‌ను ఎవరు బెదిరించారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తాం. ఇకపై మహాప్రస్థానం వాహనాల్లో ఉచితంగానే మృతదేహాలను తరలిస్తాం. మహాప్రస్థానం అంబులెన్స్‌లు నితంతరం పనిచేసేలా త్వరలో విధానం తీసుకొస్తాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img