Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఏపీలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల.. ఉభయ గోదావరి, కర్నూలు, కడప జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడిరది. విశాఖపట్నంలో మేఘాలు దట్టంగా అలముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. విశాఖపట్నంలో మేఘాలు దట్టంగా అలముకున్న దృశ్యాలు స్థానికులకు కనువిందు చేశాయి. విశాఖపట్నం నగరంలోని మధురవాడ, పీఎం పాలెం, ఆనందపురం, చంద్రంపాలెం, రుషికొండ, ఎండాడ, డెయిరీ ఫామ్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే, రాజమహేంద్రవరంతో పాటు కోనసీమ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. అనకాపల్లి, మారేడుమిల్లి, అడ్డతీగల, కొయ్యూరు ప్రాంతాల్లో వర్షం ప్రభావంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. కర్నూలు జిల్లాలోని హలహర్వి మండలంలో సోమవారం ఉదయం నుంచే భారీ వర్షం కురుస్తోంది. వాగులు పొంగటంతో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. నిట్రవట్టి, గూళెం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మెదేహాల్‌ వద్ద తాత్కాలిక వంతెన కోతకు గురైంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌- కర్ణాటక రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img