Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైసీపీ ప్లీనరీ కాదు.. అదో డ్రామా గ్యాలరీ…: అచ్చెన్నాయుడు

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర వైసీపీ ప్లీనరీ కొనసాగుతోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. వైసీపీ ప్లీనరీ కాదు డ్రామా గ్యాలరీ అని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్లీనరీ పేరుతో జగన్‌ అధికార దుర్వినియోగం ప్లీనరీ పేరుతో జగన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్లీనరీ కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీకి పది కోట్ల రూపాయల నష్టం అని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి, మూడు సార్లు టికెట్‌ చార్జీలు పెంచారని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు ప్రతిపక్ష పార్టీల సభలు పెట్టుకుంటే కుంటి సాకులు చెప్పి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసే ప్రభుత్వం, నేడు వైసిపి ప్లీనరీ కి మాత్రం సకల మర్యాదలు చేస్తోందంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తే ఆర్టీసీ బస్సులకు, ప్రైవేట్‌ వాహనాలకు అనుమతి ఇవ్వలేదని, రాజధాని అమరావతి కోసం రైతులు నిర్వహించిన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఇక ఇప్పుడు వైసీపీ ప్లీనరీకి మాత్రం రెడ్‌ కార్పెట్‌ వేసి మరీ సేవలు చేస్తున్నారంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున యూనివర్సిటీకి సెలవు ఇచ్చి మరీ వైసీపీ ప్లీనరీ నిర్వహించడం దేనికని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలను బెదిరించి మరీ ప్లీనరీకి తరలిస్తున్నారన్నారు. అంతేకాదు స్కూల్‌ బస్సులు, ప్రైవేటు వాహనాలను బలవంతంగా లాక్కుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img