Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సహజ మరణాలపై టీడీపీ రాజకీయం: సీఎం జగన్‌

సీఎం జగన్‌ అసెంబ్లీలో టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు.జంగారెడ్డి గూడెం మరణాల నేపథ్యంలో సాధారణ మరణాలను సైతం టీడీపీ రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. దేశంలో 90 శాతం సహజమరణాలే ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పుడు సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని విమర్శించారు.కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేక సార్లు జరిగాయి. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్‌ షాపులను సమూలంగా నిర్మూలించామన్నారు. ‘‘లాభాపేక్షతో గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపింది. బడి, గుడి సమీపంలో కూడా యథేచ్ఛగా మద్యం అమ్మారు.’’ అని సీఎం ధ్వజమెత్తారు.సహజ మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి. దేశంలో ఎక్కడైనా 90 శాతం సహజ మరణాలే ఉంటాయి. అన్ని మరణాలు ఒకే చోట జరిగినవి కాదు. సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని’’ సీఎం మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక కల్తీమద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపామని, 43 వేల బెల్టు షాపులను తొలగించామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img