Friday, April 26, 2024
Friday, April 26, 2024

క్రిసిల్‌ భాగస్వామ్యంతో ఓఎల్‌ఎక్స్‌ ఆటోస్‌ అధ్యయనం

హైదరాబాద్‌ : ఓఎల్‌ఎక్స్‌ ఆటోస్‌ తన ఆటో రిపోర్ట్‌ 5వ ఎడిషన్‌ ‘ది ఓఎల్‌ఎక్స్‌-క్రిసిల్‌ ఆటో స్టడీ 2021’ ని వెలువరించింది. భారతదేశంలో ప్రి-ఓన్డ్‌ కార్‌ మార్కెట్‌ పరిమాణాన్ని అది అంచనా వేసింది. క్రిసిల్‌తో కలసి ఓఎల్‌ఎక్స్‌ ఆటో ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ప్రి-ఓన్డ్‌ కార్‌ విభాగంలో తాజా ధోరణులు ఎలా ఉన్నాయో అది వెల్లడిరచింది. ఈ నివేదిక ప్రకారం ప్రి-ఓన్డ్‌ కార్‌ మార్కెట్‌, నూతన కార్‌ మార్కెట్‌ను అధిగమించనుంది. ఇది 2022 ఆర్థిక సంవత్సరం నాటికి 15 శాతం ఆరోగ్యదాయక వృద్ధి రేటును సాధించగలదని అంచనా. ప్రి-ఓన్డ్‌ కార్ల పరిశ్రమ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 7 మిలియన్‌ యూనిట్లను దాటనుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఇది 3.8 మిలియన్‌ యూనిట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img