Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

శామ్‌సంగ్‌ బ్లూ ఫెస్ట్‌ 2.0తో భారీ ఆఫర్లు

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండు శామ్‌సంగ్‌ తాజాగా ప్రీమియం టెలివిజన్లు, రెఫ్రిజిరేటర్లు, డిష్‌ వాషర్లు, మైక్రోవేవ్‌ ఓవెన్లు మరియు సౌండ్‌ బార్‌ల ఎంపిక చేసిన మోడళ్ళపై తన అద్భుతమైన ‘బ్లూ ఫెస్ట్‌’ ఆఫర్లను తిరిగి తీసుకువచ్చింది. బ్లూ ఫెస్ట్‌ 2.0 ఆఫర్లు శామ్‌సంగ్‌ అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌, శామ్‌సంగ్‌ షాప్‌, దేశవ్యాప్తంగా అన్ని అగ్రగామి ఎలక్ట్రానిక్‌ రిటెయిల్‌ స్టోర్ల వ్యాప్తంగా 2022, జూలై 15 నుండి ఆగస్టు 21 వరకూ చెల్లుబాటులో ఉంటాయి. ఆఫర్‌ వ్యవధి సందర్భంగా, వినియోగదారులు తమ అభిమాన శామ్‌సంగ్‌ వినియోగదారు మన్నిక వస్తువులపై ప్రత్యేకమైన డీల్స్‌, పరిమిత వ్యవధి ఆఫర్లను అందుబాటు చేసుకోవచ్చు. వినియోగదారులు బెస్పోక్‌ ఫ్యామిలీ హబ్‌ రెఫ్రిజిరేటరుతో ఒక ఉచిత శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌22, 30% వరకూ తక్షణ డిస్కౌంట్‌, 20% వరకూ అదనపు క్యాష్‌ బ్యాక్‌, డౌన్‌ పేమెంట్‌ ఏమీ లేని సులభమైన ఇఎంఐలను ఇతర అద్భుతమైన బండిల్‌ డీల్స్‌తో పాటు పొందవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img