Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఆరోగ్యానికి బాదాముల బహుమతి

ముంబయి : తోబుట్టువుల పరస్పర ప్రేమకు రక్షాబంధన్‌ ప్రతీక. బహమతులను ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా సంతోషాన్ని వేడుక చేసుకోవడానికి ఇదొక సమయం. అయితే సాధారణ బహుమతుల కన్నా వారి ఆరోగ్యం, శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఈ రక్షాబంధన్‌ వేళ, మన బంధాన్ని బలోపేతం చేసుకుంటూ ఓ బాక్స్‌ నిండుగా ఆరోగ్యాన్నిచ్చే బాదముల బాక్సును బహుమతిగా ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. బాదముల్లో ప్రొటీన్‌ (6గ్రాములు), ఫైబర్‌ (4గ్రాములు), చక్కటి ఫ్యాట్స్‌ (9.5 గ్రాములు), విటమిన్‌ ఈ (7.7 మిల్లీ గ్రాములు), కాల్షియం (81 ఎంజీ), మెగ్నీషియం(81ఎంజీ), ఇతర పోషకాలు ప్రతి 30గ్రాముల బాదములతో పాటుగా లభిస్తాయి. పలు పరిశోధనా అధ్యయనాలు వెల్లడిరచే దాని ప్రకారం మధుమేహ నియంత్రణలో బాదములు తోడ్పడతాయి. అలాగే బరువు నియంత్రణ, కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలకు తగిన పరిష్కారాలనూ బాదములు అందించగలవు. అందుకే ఈ రక్షా బంధన్‌ వేళ బహుమతిగా బాదముల బాక్స్‌ ఇవ్వాలని న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img