హైదరాబాద్ : ప్రముఖ గొలుసుకట్టు బార్బెక్యూ రెస్టారెంట్లున్న అబ్సల్యూట్ బార్బెక్యూస్ (ఎబి) తన 44 వ రెస్టారెంట్‌ను సికింద్రాబాద్, ఎస్.డి రోడ్‌లోని ముచ్చర్ల భవన్, 4వ అంతస్తులోని, 110లో ప్రారంభమైంది. దీనితో హైదరాబాద్‌లోని అవుట్లెట్లతో కలిపి తెలంగాణలో ఎబి తన 6వ ఔట్‌లెట్‌ను ప్రారంభించినట్లయ్యింది. కస్టమర్ కేంద్రీకృత సేవలపై మాట్లాడటమే కాకుండా దానిని ఆచరించడం ద్వారా బ్రాండ్ ఒక ఉదాహరణగా నిలుస్తున్నది. 2013 లో ప్రారంభమైన ఎబి, ఇప్పటికే బార్బెక్యూలో ఒక ప్రసిద్ధ బ్రాండ్‌గా కొనసాగుతున్నది, భారతదేశంలోని 18 నగరాలలో బహుళ ఉనికిని కలిగివున్నది. దుబాయ్‌లో రెండు రెస్టారెంట్లను కూడా కంపెనీ నిర్వహిస్తున్నది