Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఎన్టీఆర్‌ కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌!

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న నూతన చిత్రం… ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. త్వరలోనే షూటింగ్‌ మొదలుకానుంది. కొరటాల శివ, ఎన్టీఆర్‌ కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్‌ బ్లాక్‌బస్టర్‌ కావడంతో తాజా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్లను కొరటాల రంగంలోకి దింపనున్నారు. ఈ మేరకు ప్రముఖ హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ ‘కెన్నీ బేట్స్‌’ ఈ సినిమాలో భాగం అయినట్లు చిత్రబృందం ట్విట్టర్‌ లో వెల్లడిరచింది. కెన్నీ బేట్స్‌కు సాబు సిరిల్‌ ఏదో వివరిస్తుంటే అందరూ గమనిస్తున్నారు. ఆ ఫొటోను బట్టి చూస్తే పెద్ద షిప్‌లో ఫైట్‌ను తీయబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ 30వ చిత్రంలో మేజర్‌ యాక్షన్‌ పార్ట్‌ అంతా కెన్నీ బేట్స్‌ కంపోజ్‌ చేయబోతున్నారని టీమ్‌ తెలియజేసింది. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’, ట్రాన్స్‌ ఫార్మర్స్‌, రష్‌ హవర్‌ 3, పెర్ల్‌ హార్బర్‌ తదితర సినిమాలకు పనిచేసిన అనుభవం కెన్నీ బేట్స్‌ కు ఉంది. గతంలో ప్రభాస్‌ ‘సాహో’ చిత్రానికి యాక్షన్‌ సన్నివేశాలను డిజైన్‌ చేసింది కూడా ఆయనే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img