హైదరాబాద్ : తొలిసారి బాబాయ్, అబ్బాయ్ .. ఇక్కడ విక్టరీ వెంకటేశ్, రానా కలిసి నటించ బోతున్నారు. ఇద్దరూ కలిసి నెట్ ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో కనిపిం చనున్నారు. ‘రానా నాయుడు’ పేరిట ఆ వెబ్ సిరీస్‌ను ఐఎన్ సీ లోకో మోటివ్, నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్‌లు కలిసి నిర్మించ నున్నాయి. అమెరికాలో సూపర్ హిట్ అయిన క్రైమ్ డ్రామా ‘రే డొనవాన్’కు రీమేక్‌గా ఈ ‘రానానాయుడు’ రూపొందుతోంది. మీర్జాపూర్, ఇన్ సైడ్ ఎడ్జ్, బంగీస్థాన్, డాగ్ విస్పరర్ వంటి హిట్ సిరీస్‌లకు దర్శకత్వం, స్క్రీన్ ప్లేకు పనిచేసిన కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మలు.. ‘రానానాయుడు’కు దర్శకత్వం వహించనున్నారు.