Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

అల్పపీడనం..ఐదు రోజులపాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు

రాగల ఐదు రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) అధికారులు వెల్లడిరచారు.అల్పపీడన ప్రభావం వల్ల 13 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర బుధవారం విడుదల చేసిన వెదర్‌ బులెటిన్‌లో వెల్లడిరచింది. ఉత్తర కొంకణ్‌, ఉత్తర మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఒడిశాలోని సంభాల్‌ పూర్‌, డియోఘడ్‌, అంగూల్‌, సోనేపూర్‌, బార్‌ ఘడ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురవనున్నందున రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img