Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

శ్వేత మృతి కేసులో భ‌ర్త‌, అత్త‌మామ‌లతో స‌హా అయిదుగురి అరెస్ట్

వైజాగ్‌ ఆర్కే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వివాహిత గురువెల్లి శ్వేత (24) మృతి కేసులో శ్వేత ఆడపడుచు భర్త సత్యం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె తల్లి రమ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆడపడుచు భర్త సత్యంపై లైంగిక వేధింపులు, అత్త-మామలు,ఆడపడుచులపై వరకట్న వేధింపుల కేసులు నమోదు చేసి భర్త, అత్త-మామ, ఆడపడుచు, ఆడపడుచు భర్తతో సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.. కాగా, శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టం అనంతరం శ్వేత మృతదేహాన్ని తల్లి రమ, బంధువులకు పోలీసులు అప్పగించారు. గురువారం శ్వేత మృతదేహానికి కాన్వెంట్‌ కూడలి సమీపంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. . మరోవైపు శ్వేత మృతిని తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ, అనుమానాస్పద మృతిగా మూడో పట్టణ పోలీసులు చెబుతున్నారు. మృతురాలు మరోవైపు శ్వేత ఇంటి నుంచి ఎటువైపు వెళ్లిందనేదానిపై సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్వేత మృతదేహం లభ్యమైన బీచ్‌ రోడ్డులోని పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది. బీచ్‌ రోడ్డులో ఇలా నిఘా కళ్లు పనిచేయకపోవడంతో శ్వేత ఏ సమయంలో ఎక్కడ ఉందనే అంశాలపై పోలీసులకు స్పష్టత కరువైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img