Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అక్కడ మనోళ్ల పరిస్థితి.. కలవరపెడుతోంది..

రాహుల్‌గాంధీ ట్వీట్‌
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం చేపట్టనున్న చర్యల వివరాలను తెలియజేయాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. భారత ప్రభుత్వం. ఇప్పటి వరకు ప్రత్యేక విమానాలో 2000 మంది దేశ పౌరులను స్వదేశానికి తరలించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇంకా అక్కడ చిక్కుకపోయిన వేలాది మంది భారతీయులు స్వదేశానికి వెనుదిరిగేందుకు భారత ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి తనను కలవరపెడుతున్నట్లు రాహుల్‌ పేర్కొన్నారు. ఆ మేరకు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వీడియోను జతచేర్చుతూ ఓ ట్వీట్‌ చేశారు. ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులు చిక్కుకపోవడం.. ఆ విజువల్స్‌ను చూస్తూ వారి కుటుంబీకులు పరితపించడం బాధాకరమన్నారు. ఇలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదన్నారు. వారిని సురక్షితంగా దేశానికి తరలించేందుకు చేపట్టనున్న చర్యల సమగ్ర వివరాలను బాధిత కుటుంబాలకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మన వారిని నిస్సహాయిలుగా వదిలేయడం సరికాదంటూ ఓ వీడియోను రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img