Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రష్యాతో పోరుకు ఖైదీలను విడుదల చేస్తున్న ఉక్రెయిన్‌

రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక నేపథ్యం ఉండి జైళ్లలో శిక్ష అనుభవిస్తోన్న వారిని, పలు నేరాల్లో అనుమానితులుగా ఉన్న వారిని విడుదల చేస్తోంది. వీరంతా ఉక్రెయిన్‌ తరపున రష్యాపై యుద్ధం చేయనున్నారు. ఈ విషయాన్ని నేషనల్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం ధ్రువీకరించింది.
రాజధాని కీవ్‌లో వీకెండ్‌ కర్ఫ్యూ ఎత్తివేత
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేశారని, ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్థులంతా రైళ్ల ద్వారా పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని భారతీయ రాయబార కార్యాలయం సూచించింది. ఈ మేరకు తాజాగా ఓ ట్వీట్‌ చేసింది. ప్రజల తరలింపునకు ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడుపుతోందని గుర్తుచేసింది.భారతీయ విద్యార్థులు ఈ ప్రత్యేక రైళ్లలో పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని భారత దౌత్య కార్యాలయం తెలిపింది. అక్కడి నుంచి రోడ్డు మార్గాల ద్వారా హంగేరి, పోలాండ్‌, రోమానియా దేశాలకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి భారతీ విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img