Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమరావతి కేసుల విచారణ అంశం..ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

మార్చి 28నే విచారణ..తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు
ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మళ్లీ చుక్కెదురైంది.అమరావతి, మూడు రాజధానుల కేసులకు సంబంధించిన పిటిషన్ల విచారణ వ్యహారంలో జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్నల ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే మార్చి 28న విచారణ జరుపుతామని ధర్మాసనం తెలపగా.. అంతకంటే ముందే విచారణ జరపాలని గురువారం మరోసారి కోరారు.అయితే మార్చి 28నే పిటిషన్లపై విచారణ చేస్తామని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్నల ధర్మాసనం తేల్చి చెప్పింది. 28 కంటే ముందే విచారణ జరపాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్ల వాదనను తోసిపుచ్చింది. ఇందులో రాజ్యాంగపరమైన అంశాలున్నాయని జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. అయితే సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వమని ప్రభుత్వ తరపు లాయర్లు కోరగా.. ధర్మాసనం నిరాకరించింది. అమరావతి కేసు అత్యవసర విచారణ సాధ్యం కాదు.. మార్చి 28 తర్వాతే విచారణ చేస్తామని తేల్చి చెప్పింది. దీంతో మార్చి 28 వరకు ఆగాల్సిందే. హైకోర్టు తీర్పుపై వెంటనే విచారణ చేపట్టాలని ఏపీ సర్కార్‌ కోరుతోంది. ఏపీ ప్రభుత్వ తరపు లాయర్లు.. ప్రతివాదులైన రైతుల తరపు లాయర్లకు ఈమెయిల్‌లో నోటీసులు పంపారు. ఈ పిటిషన్లపై ఈ నెల 23న విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు విచారణ జరగలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img