Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం..సురక్షిత ప్రాంతాలకు 15 వేల మంది

16 చేరిన మృతులు..కొనసాగుతున్న సహాయక చర్యలు
జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఆకస్మిక వరద బీభత్సంలో చనిపోయిన వారి సంఖ్య 16కు చేరింది. మరో 40 మంది వరదల్లో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా 65 మంది గాయపడ్డారు. అదే సమయంలో అక్కడ చిక్కుకుపోయిన 15 వేల మంది యాత్రికులను స్థానిక అధికారులు రక్షించారు. వారిని పంజ్‌తర్ని దిగువ బేస్‌ క్యాంప్‌కు తరలించినట్టు ఐటీబీపీ అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘నిన్న సాయంత్రం సంభవించిన ఆకస్మిక వరద కారణంగా పవిత్ర గుహ ప్రాంతానికి సమీపంలో చిక్కుకుపోయిన చాలా మంది యాత్రికులను పంజ్‌తర్నికి తరలించాం. తెల్లవారుజామున 3:38 గంటల వరకు తరలింపు కొనసాగింది. ట్రాక్‌పై యాత్రికులు ఎవరూ ఉండరు. ఇప్పటి వరకు 15 వేల మందిని సురక్షితంగా తరలించాం.’’ అని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ అధికార ప్రతినిధి తెలిపారు.
అలాగే ఈ వరదల్లో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని పారా మిలటరీ దళానికి చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్స అందించారని సరిహద్దు భద్రతా దళం ప్రతినిధి తెలిపారు.శుక్రవారం రాత్రి పంజ్‌తర్నిలో ఏర్పాటు చేసిన బీఎస్‌ఎఫ్‌ శిబిరంలో సుమారు 150 మంది యాత్రికులు బస చేయగా, గాయపడిన 15 మందిని శనివారం ఉదయం బల్తాల్‌కు విమానంలో తరలించారు. దీంతో ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రెస్క్యూ ఆపరేషన్స్‌ ముగిసిన తర్వాత తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకుంటామని సీనియర్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి తెలిపారు.దక్షిణ కశ్మీర్‌ హియాలయాల్లోని మంచు లింగాన్ని దర్శించుకునేందుకు జూన్‌ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్రం ప్రారంభమైంది. అయితే శుక్రవారం సాయంత్రం అక్కడ వర్షం ప్రారంభమై.. వరద పోటెత్తింది. దీంతో వేలాది మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img