Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ గూండాలపై
చర్యలేవి?

సీపీఐ సూటిప్రశ్న

న్యూదిల్లీ: దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) క్యాంపస్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌`ఏబీవీపీ గూండాల విధ్వంసం, అరాచకాలను సీపీఐ తీవ్రంగా ఖండిరచింది. జేఎన్‌యూ క్యాంపస్‌లోని విద్యార్థి సంఘాల కార్యాలయం గోడలపై గల పెరియార్‌, భగత్‌సింగ్‌, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, కారల్‌ మార్స్స్‌, జ్యోతిబా పూలె, సావిత్రీబాయి పూలె వంటి మహనీయుల చిత్రాలను ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ గూండాలు ఫిబ్రవరి 19న ధ్వంసం చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ దుర్మార్గ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి…నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. తమ సైద్ధాంతిక భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్ష, ప్రగతిశీల విద్యార్థులపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ కార్యకర్తలు దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదని పేర్కొంది. క్యాంపస్‌లో మత సామరస్యతను విచ్ఛిన్నం చేసేందుకు మతోన్మాద శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని విమర్శించింది. విద్యార్థి సంఘం కార్యాలయం ధ్వంసాన్ని, విద్యార్థులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ గూండాలు ఇంతటి దారుణాలకు పాల్పడుతున్నా యూనివర్సిటీ యంత్రాంగంగానీ, దిల్లీ పోలీసులు గానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలను సహించేది లేదని స్పష్టంచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img