Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రేపు దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు 2021-22 ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. అనంతరం సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సభాపతి ఓం బిర్లా ప్రకటించారు. ఈసారి జనాకర్షక బడ్జెట్‌ రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8 నుంచి 8.8.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక శాఖ అంచనాల నేపథ్యంలో ఈ సర్వేను మంత్రి ప్రవేశపెట్టారు. సర్వే వివరాలను ఆర్థిక శాఖ ప్రత్యేక మీడియా సమావేశంలో వెల్లడిరచనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img