Friday, April 26, 2024
Friday, April 26, 2024

11 వరకు ఎన్నికల ర్యాలీలపై నిషేధం

రోడ్‌షోలు, పాదయాత్రలకూ అనుమతి నిరాకరణ
ప్రచార బహిరంగ సభల్లో వెయ్యి మందికి ఓకే
కోవిడ్‌ నిబంధనల అమలు తప్పనిసరి
కేంద్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు

న్యూదిల్లీ : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహించే ప్రచారం నేపథ్యంలో రోడ్‌షోలు, బైక్‌, సైకిల్‌ ర్యాలీలు, పాదయాత్రలపై నిషేధాన్ని వచ్చేనెల 11వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వెల్లడిరచింది. బహిరంగ సభల్లో వెయ్యి మంది, ఇండోర్‌ సభలలో పాల్గొనే వారి సంఖ్య 500కి మించరాదని స్పష్టంచేసింది. గోవా, మణిపూర్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తప్రదేశ్‌ రాష్ట్రాల్లో కోవిడ్‌ పరిస్థితిని సీఈసీ సుశీల్‌ చంద్ర, ఈసీలు రాజీవ్‌ కుమార్‌, అనూప్‌ చంద్ర పాండే సమీక్షించారు. కోవిడ్‌ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, 20 మందితో ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడిరచింది. గతంలో బహిరంగ సభలకు 500 మందికి అనుమతి ఉంటే ఇంటింటి ప్రచారానికి పది మందికే అవకాశం కల్పించారు. ఇండోర్‌ సభల్లో 300 మందికి బదులు 500 మంది పాల్గొనేందుకు ప్రస్తుతం వీలు కల్పించారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ` రాష్ట్రాల ఆరోగ్య శాఖాధికారులు, అధికారులు ఐదు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు సమావేశమై నిర్ణయించారు. ఎన్నికల రాష్ట్రాల్లో కోవిడ్‌ పరిస్థితి, వాక్సినేషన్‌ తీరును సమీక్షించారు. కోవిడ్‌ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో పోలింగ్‌ బూత్‌ల సంఖ్యనూ పెంచారు. ఉత్తరప్రదేశ్‌లో 1,74,351Ñ ఉత్తరాఖండ్‌లో 11,647Ñ పంజాబ్‌లో 24,689Ñ మణిపూర్‌లో 2,959 చొప్పున బూత్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img