Friday, April 26, 2024
Friday, April 26, 2024

రెండు లక్షల దిగువకు కరోనా కేసులు..వెయ్యికి పైగా మరణాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో (సోమవారం) కేసుల సంఖ్య భారీగా తగ్గింది. చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య రెండు లక్షల దిగువకు చేరువయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 11.6 శాతానికి తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా నిన్న 1,67,059 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. మరణాల సంఖ్య భారీగా పెరిగి వెయ్యి దాటింది. ముందు రోజు 959గా ఉన్న మృతుల సంఖ్య 24 గంటల వ్యవధిలో 1,192 కి పెరిగింది. కేరళ రాష్ట్రం మునుపటి గణాంకాలను సవరిస్తుండటమే ఈ మార్పునకు కారణం. ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 729 మరణాలు లెక్కకొచ్చాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. రోజూవారి పాజిటివిటీ రేటు ప్రస్తుతం 11.69 శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా మహమ్మారి నుంచి 2,54,076 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్‌ కేసులు (4.20 శాతం) ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.14 కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 4,96,242కి పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 3.92 కోట్ల మంది కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు దేశంలో 94 శాతం ఉన్నట్లు కేంద్ర తెలిపింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,66,68,48,204 టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img