Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉగ్రవాదుల పట్టుపై ఐరాస ఆందోళన

ఐక్యరాజ్య సమితి : ప్రపంచంలోని వివిధ ప్రాంతా లలో ఉగ్రవాదులు పట్టు సాధిస్తున్నారని ఐక్యరాజ్యస మితి సెక్రటరీ జనరల్‌ గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల విజయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకు ధైర్యాన్నిస్తుందని హెచ్చరించారు. అంతర్జాతీయ సంబంధాలలో అఫ్గాన్‌ నిర్మాణాత్మకపాత్ర పోషించవలసి అవసరం ఉందనీ దీనిపై తాలిబన్లతో చర్చించవలసి ఉందన్నారు. అంత ర్జాతీయ ఉగ్రవాదంపై గుటెర్రస్‌ విచారం వ్యక్తం చేస్తూ ఆఫ్రికాలోని సహేల్‌లోని దృష్టాంతాలను ఉటంకిం చారు. ప్రపంచంలోని వివిధ దేశాలు ఉగ్రవాదాన్ని తిప్పికొట్టే పరిస్థితులు లేవని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గుటెర్రస్‌ పేర్కొన్నారు. ప్రపంచం అంతా ఒక్క తాటిపై నిలబడి సంఫీుభావంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవలసి ఉందన్నారు. తీవ్రవాదాన్ని పరిష్కరించేందుకు సమర్థవంతమైన యంత్రాంగం మాకులేదు అందుకే ఉగ్రవాదులు పట్టుసాధించారని అన్నారు. అఫ్గాన్‌లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం దేశంలోని వివిధ వర్గాలను పాలనలో మిళితంచేయాలన్నారు. అఫ్గాన్‌ ప్రభుత్వం సమగ్ర ప్రభుత్వం కావాలని గుటెర్రస్‌ పేర్కొన్నారు. ప్రాధమిక మానవహక్కులకు అఫ్గాన్‌ ప్రభుత్వం విఘాతం కలిగించరాదన్నారు. మహిళలు, బాలికల హక్కులను కాపాడాలని తెలిపారు. ఆఫ్గాన్‌ ప్రజలకు మద్దతు పలికేందుకు తాము అన్నివేళలా సిద్ధంగా ఉన్నామన్నారు. అఫ్గాన్‌లో పరిస్థితిపై స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాతనే తాము ఆర్థికంగా ఆ దేశ పునరుద్ధరణకు ఆర్థికసాయంపై నిర్ణయిస్తామని గుటెర్రస్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img