Friday, April 26, 2024
Friday, April 26, 2024

కోరలు చాస్తున్నకాలుష్యం

మానవాళి మనుగడకే సవాలు
ఏటా 90 లక్షల మంది మృతి
2019లో భారత్‌లోనే 23 లక్షల మంది
వెల్లడిరచిన కీలక అధ్యయనం

న్యూదిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం కోరలు చాస్తోంది. మానవాళి మనుగడకే పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది ప్రాణాలను తీస్తూ మానవాళి భవిష్యత్తుకు పెద్ద సవాలు విసురుతోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌ ప్రచురించింది. వివిధ రకాల కాలుష్యాలున్నా అందులో ప్రధానంగా వాయు కాలుష్యం తోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఆరుగురిలో ఒకరు మృత్యువాతపడుతున్నట్టు తెలిపింది. 2000 సంవత్సరం నుంచి గాలి కాలుష్య తీవ్రత పెరిగిందని తెలిపింది. కార్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు సహా పరిశ్రమల నుంచి విడుదలయ్యే కలుషితమైన గాలి కారణంగా మరణాల సంఖ్య విపరీలంగా పెరిగినట్టు పేర్కొంది. 2000 సంవత్సరంలో పోల్చి చూస్తే 2019 నాటికి ఈ మరణాలు 55 శాతం పెరిగినట్టు లాన్సెట్‌ అధ్యయనం వెల్లడిరచింది. కాలుష్య మరణాలలో భారత్‌, చైనాలు ప్రపంచంలోనే అగ్రస్థానం ఉన్నట్టు తెలిపింది. జనాభా పరంగాను పెద్ద దేశాలైన వీటిలో ఏటా 2.2 నుంచి 2.4 మిలియన్ల ప్రజలు మృతి చెందినట్టు తెలిపింది. భారత్‌ విషయానికి వస్తే వాయు కాలుష్యం తీవ్రత అధికమని తెలిపింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కన్నా భారత్‌లోనే అన్నా రకాల కాలుష్య మరణాలు అత్యధికమని పేర్కొంది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 23.5 లక్షల మంది మృత్యువాత పడ్డారని ఇందులో కేవలం గాలి కాలుష్యం కారణంగా 16.7 లక్షల మంది మంది మరణించారని వెల్లడిరచింది. బంగ్లాదేశ్‌, ఇథియోపియాల్లోనూ కాలుష్య మరణాలు చాలా ఎక్కువని పేర్కొంది. కాలుష్యం కారణంగా అధిక మరణాలు ఉన్న 10 దేశాలలో అమెరికా 7వ స్థానంలో ఉన్నట్టు తెలిపింది. కాలుష్యం కారణంగా మరణాలు తక్కువగా ఉన్న దేశాల్లో బ్రూనై, ఖతార్‌ ఉన్నట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య మరణాలను లెక్కవేస్తే ప్రతి ఏటా లక్ష మందిలో 117 మంది మరణిస్తున్నట్టు గుర్తించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img