Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

గాంధీ వల్లే సావార్కర్‌ క్షమాభిక్ష అభ్యర్థన

రాజ్‌నాథ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
జైరాం రమేశ్‌, ఒవైసీ, బాఘెల్‌ ఖండన

న్యూదిల్లీ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ చరిత్రకు ‘వక్రభాష్యం’ చెప్పే ప్రయత్నం ముమ్మరమైంది. కమలం దళసభ్యులు తరచూ చరిత్రను తప్పుగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ సూచన మేరకే వీర సావార్కర్‌ ఖైదులో ఉండి క్షమాభిక్షకు దరఖాస్తు చేశారన్నారు. సావార్కర్‌ ను అవమానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, గాంధీ చెబితేనే ఆయన బ్రిటీిష్‌ వాళ్లకు క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నా రని రాజ్‌నాథ్‌ అన్నారు. ఆయన బ్రిటీషు వారి ఎదుట లొంగిపోయినట్లు అవాస్తవ ప్రచారం జరుగుతోందన్నారు. సావార్కర్‌పై పుస్తకాన్ని దిల్లీలో జరిగిన కార్యక్ర మంలో రాజ్‌నాథ్‌ ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌, ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా ఖండిరచారు. చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మహాత్మాగాంధీని తొలగించి సావార్కర్‌ను జాతిపిత చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఇదే వ్యవహారంలో 1920, జనవరి 25వ తేదీన సావార్కర్‌ సోదరునికి గాంధీ రాసిన లేఖ ప్రతిని ఒవైసీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. గాంధీ రాతలను వక్రీకరించే ప్రయత్నాన్ని కేంద్రమంత్రి చేశారని విమర్శించారు. జైల్లో ఉన్న ఆరు నెలలకే సావర్కర్‌ మొదటి పిటిషన్‌ను 1911లో రాశారని, ఆ సమయంలో గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నారని ఒవైసీ తెలిపారు. 1913/14లో మరోసారి క్షమాభిక్షకు సావార్కర్‌ పిటిషన్‌ వేశారని, గాంధీ సలహా మేరకు 1920లో మళ్లీ అర్జీ పెట్టుకున్నారని వెల్లడిరచారు. మోదీ ప్రభుత్వంలో హూందాగా ఉండే నేతల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒకరైనప్పటికీ చరిత్రను తిరగరాసే / వక్రీక రించే ఆర్‌ఎస్‌ఎస్‌ అలవాటు ఆయనకూ ఉన్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ కూడా సావార్కర్‌ సోదరునికి గాంధీ రాసిన లేఖను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్‌ కూడా రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. జైల్లో ఉన్న సావార్కర్‌తో గాంధీ ఎలా సంభాషించారని ప్రశ్నించారు. ‘ఓ మాట స్పష్టం చేయండి. ఆ సమయంలో మహాత్మాగాంధీ ఎక్కడ ఉన్నారు? ఆయన వార్దా (మహారాష్ట్ర)లో ఉంటే సావార్కర్‌ ఎక్కడ ఉన్నారు? అండమాన్‌ నికోబర్‌ ద్వీపాల్లో సెల్యూలార్‌ జైల్లో ఉన్నారు. వారు ఒకర్కొకరిని ఎలా కలిసివుం టారు? ఆయన జైల్లో ఉండి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నారు. ఒక్కసారి కాదు కనీసం ఆరు అర్జీలు పెట్టుకున్నారు’ అని బాఘెల్‌ వ్యాఖ్యానించారు. బ్రిటిష్‌వారికి క్షమాపణ చెప్పిన తర్వాత వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. బ్రిటిష్‌ వారి ‘విభజించి పాలించు’ అజెండా దిశగా పనిచేశారన్నారు. 1925లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు దేశాల సిద్ధాంతాన్ని తొలిసారి సూచించింది ఆయనేనని కాంగ్రెస్‌ నేత వెల్లడిరచారు. 1925లో హిందుస్థాన్‌, పాకిస్థాన్‌ గురించి మాట్లాడారు. 1937లో ముస్లిం లీగ్‌ ప్రస్తావన తెచ్చారు. రెండు మతశక్తులు కలిసి దేశ విభజనకు రంగం సిద్ధం చేశాయని బాఘెల్‌ వెల్లడిరచారు. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి కూడా స్పందించారు. ఈ వ్యవహారంలో స్పష్టత రావాలంటే గాంధీ, సావార్కర్‌ లేఖలను బహిర్గతం చేయాలని డిమాండు చేశారు. నిజనిర్థారణ జరగాలని త్యాగి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img