Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

గులాబ్‌ బీభత్సం

వరద ముంపులో ఉత్తరాంధ్ర
కోస్తాలో కుంభవృష్టి
విశాఖ జిల్లాలో రాయి పడి మహిళ, విద్యుత్‌ షాక్‌తో బాలుడి మృతి
కూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు` అంధకారంలో గ్రామాలు
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి / విశాఖపట్నం : గులాబ్‌ తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాలోని అనేక ప్రాంతాలను వరదల్లో ముంచెత్తింది. కళింగపట్నా నికి 20 కిలోమీటర్ల దూరంలో ఆదివారం రాత్రి తుపాను తీరం దాటడంతో ఉత్తరాంధ్ర ఆ ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో ఈదురు గాలుల ఉధృతి అధికంగా ఉండడంతో అనేక చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలకు విశాఖ నగరంలో ఉన్న రహదారులన్నీ చెరువులయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. ఓల్డ్‌ టౌన్‌ లో అనేక కాలనీల్లో వరద నీరు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మరోపక్క కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న అనేకమంది బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. జ్ఞానాపురం , భూపేష్‌ నగర్‌, లక్ష్మీ దేవి పేట, అంబేద్కర్‌ కాలనీ, జండా చెట్టు వీధి ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌, జోనల్‌ కమిషనర్‌ రమణ వరద ప్రాంతాల్లో పర్యటించారు. కుండపోత వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయనగరం, విశాఖ జిల్లాలోనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువగా, ఆ తర్వాత విజయనగరంపై తుపాను ప్రభావం చూపించింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిరది. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సముద్రంలో రెండు మత్స్యకారుల పడవలు బోల్తా పడ్డాయి. వీరిలో ఒకరు గల్లంతు కాగా, మిగిలినవారు ఒడ్డుకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తుపాను తీరం దాటింది. దీని ప్రభావంతో సముద్రంలో అలలు సాధారణం కంటే మీటరు ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఉత్తరకోస్తాలో మిగిలిన ప్రాంతాల్లో 50 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉద్దానం ప్రాంతంలో అరటి, కొబ్బరి పంటలకు నష్టం వాటిల్లింది. రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఆరు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. తోటపల్లి ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో పెరగడంతో 10 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. జంరaావతి, సువర్ణముఖి, వేగావతి, చంపావతి, గోస్తనీ నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. భోగాపురంలో సముద్రం పది మీటర్ల మేర ముందుకొచ్చింది. అత్యధికంగా గార మండలంలో 149 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెందుర్తి మండలం నాయుడు తోట 94 వార్డు లో అప్పలనర్సయ్య కాలనీకి చెందిన తులసి భావన (31) అనే మహిళ కొండ రాయి పడి మృతి చెందింది. అలాగే వేపగుంట సమీపంలో గల గిరిప్రసాద్‌ నగర్‌ లో విద్యుత్‌ షాక్‌ తో సుమంత్‌ అనే 5 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. కేకే లైన్‌ లో కొండచరియలు విరిగిపడడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. చిమిడిపల్లి , బొర్రా రైల్వేస్టేషన్లు మధ్య బొర్రా కి 2కిమీ దూరంలో ఉన్న అరకు కిరండోల్‌ రైల్వే ట్రాక్‌ పై కొండచరియలు విరిగి పడటంతో ఈ మార్గంలో రైళ్లకు అంతరాయం ఏర్పడిరది . విశాఖ ఏజెన్సీలో పలుచోట్ల వంతెనలు విరిగిపడ్డాయి. పంట పొలాలు నీట మునిగి చెరువుల తలపిస్తున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఆదివారం రాత్రి నుండి వందలాది గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి అంధకారంలో మునిగాయి. పాడేరు – జోలాపుట్‌ ప్రధాన రహదారిలోని గుత్తులపుట్టు వద్ద వంతెన కొట్టుకుపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. గులాబ్‌ తుపాను కారణంగా విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కుండపోతగా వర్షాలు కురిశాయి. విజయవాడ నగరంలో రహదారులన్నీ చెరువులను తలపించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img