Friday, April 26, 2024
Friday, April 26, 2024

గూఢచర్యం కేసులో డిప్యూటీ సీఎం సిసోడియాపై కేసు.. సీబీఐ వినతిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అంగీకారం

స్నూపింగ్‌ ఆరోపణలపై ఢల్లీి ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు కేంద్ర హోం శాఖ షాకిచ్చింది. ఫీడ్‌బాక్‌ యూనిట్‌ స్నూపింగ్‌ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద సిసోడియా విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. ఢల్లీి డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఇప్పుడు గూఢచర్యం కేసులో అవినీతి కేసును ఎదుర్కోనున్నారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఈ విషయాన్ని విచారించనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తర్వాత.. డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ క్యాబినెట్‌లో సత్యేందర్‌ జైన్‌ తర్వాత చాలా బలమైన మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం దీనిపై కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించింది. అప్పటి నుండి సోషల్‌ మీడియాలో ఎఫ్‌బియు, మనీష్‌ సిసోడియా గురించి చర్చలు తారాస్థాయికి చేరుకున్నాయి.వివిధ శాఖల్లో అక్రమాలను తనిఖీ చేయడానికి ఆప్‌ సర్కారు నియమించిన ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ను ప్రభుత్వం రాజకీయంగా వాడుకొని దుర్వినియోగం చేసిందని సీబీఐ ఆరోపించింది.ఇందులో ఢల్లీి ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా పాత్ర అధికంగా ఉందని.. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img