Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు పోలీసుల దుర్మరణం

పలాస : శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయి జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల ఏఆర్‌ పోలీసులు నలుగురు మృతి చెందారు. మందస మండలం బైరిసారంగపురం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి గేదెల జయరాం మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. అక్కడ నుంచి పక్కన గల రహదారిపైకి వచ్చి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఏఆర్‌ ఎస్‌ఐ కృష్ణంనాయుడు, కానిస్టేబుళ్లు పి.జనార్ధనరావు, బాబూరావు, పీటీ ఆంటోనీ ఉన్నారు. ప్రమాద వివరాలను కాశీబుగ్గ సీఐ శంకరరావు తెలిపారు. వారు ఎచ్చెర్ల ఏఆర్‌కి చెందిన వారిగా వెల్లడిరచారు. మృతదేహాలను పోస్టుమార్గం నిమిత్తం పలాస ప్రభుత్వాసుత్రికి తరలించారు.
ఆదుకుంటాం : మంత్రి అప్పలరాజు
రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతిచెందిన సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. మంత్రి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు, వైసీపీ నాయకులు బి.బల్లయ్య, ఉప్పరపల్లి ఉదయ్‌, త్యాడి ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img