Friday, April 26, 2024
Friday, April 26, 2024

చంద్రుని చుట్టూ 9వేల చక్కర్లు

చంద్రయాన్‌ `2పై ఇస్రో ప్రకటన

బెంగళూరు : భారత్‌కు చెందిన అంతరిక్షనౌక చంద్రయాన్‌2 చంద్రుని చుట్టూ తొమ్మిది వేల ఆర్బిట్లు పూర్తి చేసిందని ఇస్రో ప్రకటించింది. రెండు రోజుల లూనార్‌ సైన్స్‌ వర్క్‌షాపును సోమవారం ప్రారంభించిన ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ ఈ వివరాలు వెల్లడిరచారు. చంద్రయాన్‌2కు చెందిన ఎనిమిది పేలోడ్‌ల ద్వారా రిమోట్‌ సెన్సింగ్‌ జరుగుతోందని, చంద్రుని చుట్టూ 9వేల ఆర్బిట్లు పూర్తి అయ్యాయని ఆయనన్నారు. చంద్రయాన్‌2 ఆర్బిటర్‌ పేలోడ్‌ డేటాతో పాటు డేటా ప్రాడక్ట్‌, సైన్స్‌ పత్రాలను బెంగళూరు ఇస్రో కేంద్ర కార్యాలయం నుంచి శివన్‌ విడుదల చేశారు. విద్యాసంస్థలు, ఇనిస్టిట్యూట్‌ల విశ్లేషణల కోసం సైన్స్‌ డేటాను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడిరచారు. సైన్స్‌ ఫలితాలు చాలా ప్రోత్సా హకంగా ఉన్నట్లు చెప్పారు. ఇస్రో అపెక్స్‌ సైన్స్‌ బోర్డు చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, చంద్రయాన్‌2 క్షిపణి ఇమేజింగ్‌, సైంటిఫిక్‌ పరికరాల ద్వారా అద్భుత డేటా అందిందని అన్నారు. చంద్రయాన్‌ `1 పరిశీలనను మరో స్థాయికి తీసుకెళ్లేలా చంద్రయాన్‌ 2 పని చేస్తోందన్నారు. ఆర్బిటర్‌ ఉపవ్యవస్థలన్నీ అద్భుతంగా పనిచేస్తున్నట్లు చంద్రయాన్‌2 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వనితా ఎం వెల్లడిరచారు. ఇంకా చాలాఏళ్ల వరకు స్పేస్‌క్రాఫ్ట్‌ నుంచి మరింత మెరుగైన డేటాను పొందగలమని ఆకాంక్షిం చారు. చంద్రుని అద్భుత దృశ్యాలను చంద్ర యాన్‌ 2లోని టీఎంసీ2 (టెర్రెయిన్‌ మాపింగ్‌ కెమెరా`2), ఐఐఆర్‌ఎస్‌ (ఇమేజింగ్‌ ఐఆర్‌ స్పెక్ట్రోమీటర్‌), ఓహెచ్‌ఆర్‌సీ (ఆర్బిటర్‌ హై రిజల్యూషన్‌ కెమెరా)లు పంపినట్లు వనితా చెప్పారు. తమ వెబ్‌సైట్‌తో పాటు ఫేస్‌బుక్‌లో రెండు రోజుల వర్క్‌షాపు ప్రత్యేక ప్రసారం ఉంటుందని ఇస్రో అధికారిక ప్రకటన పేర్కొంది. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఇస్రో/డీఓఎస్‌ శాస్త్రవేత్తలతో పాటు లూనార్‌ సైన్స్‌పై ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ కోల్‌కతాÑ ఇండి యన్‌ ఇనిసిస్ట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు, ఇండి యన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రూర్కీల శాస్త్రవే త్తల ఉపన్యాసాలు ఉంటాయని ఇస్రో వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img