Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత

పరిహారం కోసం నిర్వాసితుల మహాధర్నా
కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం
నారాయణ సహా 25 మంది అరెస్టు
రైతులను బెదిరించి భూములు లాక్కుంటున్నారు : నారాయణ

విశాలాంధ్ర- చిత్తూరు : చిత్తూరు కలెక్టరేట్‌లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిరది. చిత్తూరుతచ్చూరు జాతీయ రహదారి నిర్వాసితుల ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. విచక్షణారహితంగా నెట్టి వేశారు. దీంతో రైతులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రైతుల ఆందోళనకు సీపీఐ జాతీయ కార్య దర్శి నారాయణ మద్దతుగా నిలిచారు. ఆందోళనకు దిగిన రైతులు, నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద చిత్తూరుతచ్చూరు జాతీయ రహదారి నిర్వాసితులు సోమవారం ధర్నాకు దిగారు. కలెక్టర్‌ బయటకు వచ్చి తమ సమస్యలు వినాలని నాయకులు పట్టుబట్టారు. కలెక్టర్‌ బయటికి రాకపో వడంతో నిర్వాసితులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన నిర్వాసితులు చిత్తూరు`బెంగళూరు జాతీయ రహ దారిపై ధర్నాకు దిగారు. రవాణా స్తంభించడంతో పోలీసులు రంగంలోకి దిగి రైతులు, నారాయణను అరెస్టు చేసి యాదమరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నారాయణ మాట్లాడుతూ ప్రాణాలైనా వదులుకుం టాం.. భూములు వదులుకోబోమని నారాయణ హెచ్చరించారు. జాతీయరహదారి కోసం భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నారాయణ డిమాండ్‌ చేశారు. రైతులను బెదిరించడం మానుకోవాలని హితువు పలికారు. ఈ జాతీయ రహదారి కోసం ఎనిమిది మండలాల రైతుల నుంచి భూములు తీసుకున్నారని, ఆ భూములకు నష్టపరిహారం చెల్లిం చకపోగా రైతులను అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించు కోవడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తామని నారాయణ హెచ్చరించారు. నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు యస్‌. నాగరాజు, పీఎల్‌ నరసింహులు, రైతులను అరెస్టు చేసి యాదమరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందో ళనలో రైతులు శ్రీనివాసుల నాయుడు, మోహన్‌ నాయుడు, స్థానిక నాయకులు మణి, గోపీనాథ్‌, దాసరి చంద్ర, రఘు, జయలక్ష్మి, విజయ్‌ గౌరీ, కుమారి, రమాదేవి, దేవయాని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img