Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చిన్న గాయం కూడా మంకీ పాక్స్‌ సంకేతం కావచ్చు..!

వ్యాధి లక్షణాలను సవరించిన యూకే హెల్త్‌ ఏజెన్సీ
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ ఆందోళన కలిగిస్తోంది. చాపకింద నీరులా ఇప్పటికే 75 దేశాలకు విస్తరించింది. మన దేశంలోకి ఈ వైరస్‌ అడుగుపెట్టింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ వైరస్‌ కేసుకు నిర్వచననాన్ని బ్రిటన్‌ కు చెందిన హెల్త్‌ ఏజెన్సీ అప్‌డేట్‌ చేసింది.
చిన్న గాయం కూడా మంకీపాక్స్‌ వైరస్‌కు సంకేతం కావొచ్చని హెచ్చరించింది. అది కూడా ఓ వ్యక్తి కొత్తగా ఎవరితో అయినా శృంగారంలో పాల్గొన్న తర్వాత చిన్న గాయం కనిపిస్తే మంకీపాక్స్‌ గా అనుమానించాల్సి ఉంటుందని యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఆరోగ్య స్థితిగా ప్రకటించడం తెలిసిందే. దీనివల్ల వ్యక్తులు, వైద్య నిపుణులు వైరస్‌ను గుర్తించడం సులభంగా ఉంటుందని పేర్కొంది. వ్యాధి లక్షణాల జాబితాను పెంచింది. ఇందులో జననాంగాలపై, మల విసర్జన ద్వారం, దాని చుట్టుపక్కల, పెదాలపై, ముఖంపై చిన్న గాయం కనిపించినా అది మంకీపాక్స్‌ వైరస్‌ కావొచ్చని పేర్కొంది. సన్నిహితంగా మెలగడం, శృంగారంలో పాల్గొనడం ద్వారా మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాపిస్తున్నట్టు ప్రాథమిక పరీక్షల ఆధారంగా తెలుస్తున్నట్టు యూకే హెల్త్‌ ఏజెన్సీ తెలిపింది. అధిక జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, లింఫ్‌ నోడ్స్‌ వాపు ఇన్ఫెక్ష్‌కు సంకేతాలుగా పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img