Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చుక్కల భూముల చిక్కులకు చెక్‌

2,06,171 ఎకరాలకు మోక్షం
నేడు సంపూర్ణ హక్కు అందించనున్న సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడుతూ…చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. బ్రిటీష్‌ కాలంలో సుమారు వంద సంవత్సరాల క్రితం భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి’ లేదా ‘ప్రైవేటు భూమి’ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్‌ రిజిస్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. ఆ భూములనే ‘చుక్కల భూములు‘ అంటారు. దీనివల్ల సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా రైతులు ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక, సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారి ఆస్థిపై పూర్తి హక్కులు యజమానికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, ఒక్క పైసా ఖర్చు లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు స్వస్తి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img