Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఛాత్రోపాధ్యాయుల నిరీక్షణ

ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం
ఏడాదికో డీఎస్సీ.. సర్కారు హామీ ఏదీ..?
రెండేళ్ల నుంచి అభ్యర్థుల శిక్షణ
వయోభారంతో ఆందోళన
రాష్ట్రంలో 25 వేలకుపైగా ఖాళీలు
జాబ్‌ పట్టీలో దక్కని చోటు

అమరావతి : అధికారంలోకి రాగానే ప్రతిఏటా ఉపాధ్యాయ ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. జగన్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి ఉపాధ్యాయ శిక్షణ (ఛాత్రోపాధ్యా యులు) పొందిన వారంతా ఉద్యోగ ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్‌ విడుదల చేసిన జాబ్‌ పట్టీలోనూ వారికి చోటు దక్కకపోవడంతో మరింత ఆవేదన గురవుతు న్నారు. 2018 డీఎస్సీ తర్వాత ఇప్పటివరకూ ఉపాధ్యాయ ఉద్యోగ ప్రకటన రానందున.. వయోపరిమితి దగ్గర పడినవారంతా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అదనంగా వయోపరి మితి పెంచి, ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం చివరి దశలో ప్రకటించిన డీఎస్సీ 2018 ఖాళీలు అరకొరగానే ఉన్నాయి. జిల్లాకు సబ్జెక్టుకు తగినన్ని ఖాళీలు లేకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. జగన్‌ పాదయాత్ర సమయంలోనూ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు, నిరుద్యోగ నేతల బృందం కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. ఇందులో అప్పటికే వయోపరిమితి నెలలు, రోజులు దగ్గరగా ఉన్న వారున్నారు. దీంతో వైసీపీ ఎన్నికల మేని ఫెస్టోలో ప్రతి ఏటా పదివేల పోస్టులతో డీఎస్సీ ప్రకటిస్తామని పొందుపరిచారు. జగన్‌ మాటలు నమ్మి వేలాది మంది నిరుద్యోగులు ఎన్నికల్లో ఆయనకు మద్దతిచ్చినట్లు చెబుతున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక డీఎస్సీ అంశం ప్రస్తావనే లేకుండా పోయిందని గగ్గోలు పెడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ భర్తీకి మాత్రమే ప్రభుత్వం పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపా ధ్యాయ ఖాళీల భర్తీకి ప్రకటన ఎప్పుడు ఇస్తుందో తెలియక, ఇంకా ఎంతకాలం చదవాలో అవగతం లేక వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
వయోపరిమితిపై గందరగోళం
ఉపాధ్యాయ పోస్టుల అభ్యర్థులకు 44 ఏళ్ల వరకు(జనరల్‌) కల్పించిన వయోపరిమితిపై గందరగోళం నెలకొంది. దానిని కుదించే చర్య లకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచా రం. ఇటీవల బ్యాక్‌లాగ్‌ ఖాళీలకు ఎస్సీ, ఎస్టీల వయోపరిమితిని 49 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు

కుదించారు. దీంతో రాబోయే డీఎస్సీలకు ఎస్సీ, ఎస్టీలకు 47 ఏళ్లుగా ఉంటే.. జనరల్‌ అభ్యర్థులకు 42కే పరిమితమవుతుంది. రెండేళ్ల నుంచి ఉద్యోగ ఖాళీలు లేనందున గతంలో ఉన్న 44 ఏళ్ల కంటే అదనంగా రెండేళ్లు పెంచాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేనందున ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల నుంచి డీఎస్సీ ప్రకటన వస్తుందనే ఆశతో వేలాది రూపాయలు వెచ్చించి, అభ్యర్థులు శిక్షణ తీసుకున్నారు. కరోనా సమయంలోనూ ఆన్‌లైన్‌ ద్వారా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నప్పటికీ, వాటి భర్తీపై ప్రభుత్వం చొరవ చూపకపోవడం విమర్శలకు దారితీస్తోంది. నూతన విద్యా విధానంపై కసరత్తు పూర్తిచేశాక ఉపాధ్యాయ పోస్టులు ప్రకటిస్తామంటూ అధికార యంత్రాంగం చెబుతున్న వ్యాఖ్యలపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తవవ్వడానికి కనీసం మరో ఏడాది సమయం పడుతుంది. అప్పటికి జగన్‌ ప్రభుత్వం మూడేళ్లు దాటుతుంది. అంటే ఏడాదికి ఒక డీఎస్సీ ఇస్తామన్న హామీ మూడేళ్ల వరకు అమలు కాకుండా ఉండిపోతుంది. అప్పటివరకు వయోభారం, ఆర్థిక భారంతో అభ్యర్థులు సతమతం కావాల్సిందే.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎప్పుడో..
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నూతన సిలబస్‌ను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇంతవరకూ ఆ పరీక్ష నిర్వహణకు కార్యాచరణ చేపట్టలేదు. రాష్ట్రంలో నూతనంగా వేలాది మంది బీఈడీ, లాంగ్వేజీ, డీఎడ్‌ విభాగాలలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్నారు. డీఎస్సీ రాయాలంటే.. వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధన తప్పనిసరి. వారితోపాటు అదనపు మార్కుల పెంపు కోసం పాత అభ్యర్థులకూ ఈ పరీక్ష రాయడం ఉపయుక్తమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసర ముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రభుత్వాలు ఈ పరీక్షను ప్రణాళి కాబద్ధంగా నిర్వహించడం లేదు. డీఎస్సీ ప్రకటనకు రెండు నెలల ముందస్తుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రకటన ఇవ్వడంతో ఏకకాలంలో అభ్యర్థులు రెండు పరీక్షలకు సిద్ధమవ్వడం కష్టంగా మారుతోంది. తొలుత ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని, రాష్ట్రంలోని 25 వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img