Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘జగనన్నకు చెబుదాం’ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన జ‌గ‌న్

పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్న వైసీపీ సర్కార్‌ ప్రజా ఫిర్యాదుల కోసం మరో అడుగు ముందుకేసింది. గతంలో స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారాలు చూపిన సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రస్తుతం స్పందన 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ”జగనన్నకు చెబుదాం” అన్న పేరుతో నూతన కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా సీఎం జగన్‌కే విన్నవించుకునే అవకాశం లభించనుంది. దీంతో ప్రజల ఫిర్యాదులు స్పందన కంటే త్వరిత గతిన పరిష్కారం కానున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలనలో కీలకంగా నిలిచిన స్పందన కార్యక్రమాన్ని పూర్తిగా అప్‌ గ్రేడ్‌ చేస్తూ.. స్పందనలో పరిష్కారం కాని అరకొర సమస్యలు కూడా సీఎం నేతృత్వంలో పనిచేసే జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పరిష్కారించేందుకు సిద్ధమైంది. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం సీఎం జగన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టీ-ం పనిచేయనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఈ టీ-ం నెట్‌ వర్క్‌ తో కనెక్ట్‌ అయి చివరగా వివిధ ప్రభుత్వ విభాగాధిపతుల స్థాయికి చేరి ప్రధానమైన ప్రజా సమస్యలు కూడా ఒకే దరఖాస్తుతో ప్రారంభం అయ్యేలా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది.

నేరుగా ఫిర్యాదు చేయొచ్చు
ప్రజలు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కాల్‌ చేసి వారి సమస్యలను చెప్పుకోవడానికి వీలు కల్పిస్తుంది. స్పందన కంటే మెరుగ్గా జగనన్నకు చెబుదాంను నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రజలకు ముఖ్యమంత్రితో ప్రత్యక్ష అనుసంధానాన్ని అందిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి మరియు వారి కార్యాలయం ప్రత్యక్ష పరిశీలనలో ఉంటు-ంది. తద్వారా సీఎం ప్రజల ఫిర్యాదులను నేరుగా విని స్పందించవచ్చు. గుణాత్మక సేవలు అందించే ఈ కార్యక్రమంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది. వ్యక్తిగత, గృహ ఫిర్యాదులను పరిష్కరించడం అత్యంత సమర్థవంతంగా సంబంధిత అధికారుల ప్రాధాన్యతగా ఉంటు-ంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img