Friday, April 26, 2024
Friday, April 26, 2024

జీవో 1పై తీర్పు రిజర్వు

హైకోర్టులో వాదనలు పూర్తి

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ప్రదర్శనలు, బహిరంగసభల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 2వ తేదీన తీసుకొచ్చిన జీవో నంబరు 1పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టి ఈ జీవోను సస్పెండ్‌ చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దీనిపై తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టే విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు విచారణ చేపట్టగా, రెండు రోజులపాటు సాగిన రెండు పక్షాల వాదనలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. జీవో నంబరు 1పై రామకృష్ణతోపాటు కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ నుంచి కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ ముగ్గురు పిటిషనర్ల తరపున కూడా న్యాయ వాదులు వాదనలు వినిపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరపున ఏజీ ఈ జీవోను సమర్థిస్తూ వాదనలు వినిపిం చారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల్లో అనేక మంది మృతి చెందిన దరిమిలా భద్రతా కారణాలతోనే ఈ జీవోను ప్రభుత్వం తీసుకొచ్చిందని, ప్రతిపక్షాల సభలు, ర్యాలీలను అడ్డుకునే ఉద్దేశం కాదని జీవో ప్రాధాన్యతను వివరించారు. రెండు వైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img