Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తెలుగుకు 12 పద్మాలు

రెండు పద్మభూషణ్‌లు, 10 పద్మశ్రీలు
చినజీయర్‌ స్వామి, కమలేష్‌ డి పటేల్‌కు పద్మభూషణ్‌
ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త దిలీప్‌ మహలనబిస్‌కు పద్మవిభూషణ్‌

న్యూదిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను బుధవారం రాత్రి ప్రకటించింది. అనేక రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. గత ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు నామినేషన్లు స్వీకరించిన కేంద్రం… గణతంత్ర వేడుకల సందర్భంగా పురస్కారాలకు ఎంపికయిన వారి జాబితాను విడుదల చేసింది. ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌) సృష్టికర్త దిలీప్‌ మహలనబిస్‌కు వైద్య రంగంలో మరణానంతరం పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన గత ఏడాది అక్టోబర్‌లో కన్నుమూశారు. అలాగే ఏపీ, తెలంగాణకు 10 పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. పద్మ విభూషణ్‌ ఆరుగురికి, పద్మభూషణ్‌ 9 మందికి, పద్మ అవార్డులు 91 మందికి ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది ఎంపికయ్యారు.
అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ వరించిన వారిలో బాలకృష్ణ దోషి (ఆర్కిటెక్చర్‌గుజరాత్‌), జకీర్‌ హుస్సేన్‌ (తబలా వాద్యకారుడుమహారాష్ట్ర), ఎస్‌ఎం కృష్ణ (ప్రజా వ్యవహారాలుకర్ణాటక), దిలీప్‌ మహాలనబిస్‌ (వైద్యంపశ్చిమ బెంగాల్‌), శ్రీనివాస వర్థన్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌అమెరికా), ములాయం సింగ్‌ యాదవ్‌ (ప్రజా వ్యవహారాలుఉత్తర ప్రదేశ్‌) ఉన్నారు.
పద్మభూషణ్‌ పొందిన వారిలో ఎస్‌.ఎల్‌.భైరప్ప (సాహిత్యంవిద్యకర్ణాటక), కుమార మంగళం బిర్లా (వాణిజ్యంపరిశ్రమలుమహారాష్ట్ర), దీపక్‌ దార్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌మహారాష్ట్ర), వాణి జయరాం (కళలుతమిళనాడు), చినజీయర్‌ స్వామి (ఆధ్యాత్మికంతెలంగాణ), సుమన్‌ కల్యాణ్‌పూర్‌ (కళలుమహారాష్ట్ర), కపిల్‌ కపూర్‌ (సాహిత్యంవిద్యదిల్లీ), సుధామూర్తి (సామాజిక సేవకర్ణాటక), కమలేష్‌ డి పటేల్‌ (ఆధ్యాత్మికతతెలంగాణ) ఉన్నారు.
తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయిన వారిలో మోదడుగు విజయ్‌ గుప్తా (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య) ఉండగా…ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (కళలు), గణేశ్‌ నాగప్ప కృష్ణరాజ నగర, అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌), సీవీ రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి (కళలు), సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ), ప్రకాశ్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య విభాగంలో) ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడా, సామాజిక, విజ్ఞాన, ఇంజనీరింగ్‌, పబ్లిక్‌ అఫైర్స్‌, సివిల్‌ సర్వీస్‌, వాణిజ్యం, పారిశ్రామిక తదితర రంగాలలో విశేష సేవలందించిన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img